59 నిమిషాల్లో రుణం అంతంత మాత్రమే!

59 minutes loan
59 minutes loan to MSME’s

న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఇ రంగంకోసం కేంద్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన 50 నిమిషాల రుణపథకంలో బ్యాంకర్లు కొంతమేర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. 2018లో ఎంఎస్‌ఎంఇ రంగానికి 59 నిమిషాల రుణసథకాన్ని ప్రధాని మోడీ స్వయంగాప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులనుంచి రూ.కోటివరకూ ఎలాంటి సెక్యూరిటీలు లేకుండా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ విధానంలో తీసుకునే సదుపాయం ఉందని ఆనాడు ప్రకటించారు. పిఎస్‌బిలోన్‌ఇన్‌59మినిట్స్‌ పోర్టల్‌కు దరఖాస్తుచేసిన 59 నిమిషాల్లోనే రుణం మంజూరవుతుందన్నది ఈ పథకం సారాంశం. ఎంఎస్‌ఎంఇ పల్స్‌, సిడ్బీ, సిబిల్‌ ప్రచురణలను చూస్తే ఎంఎస్‌ఎంఇ రుణమార్కెట్‌రూ.25 కోట్లలోపు ఉన్నది సుమారు రూ.25 లక్షలకోట్లవరకూ ఉంది. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకులు 50శాతం వాటాతో ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ రుణాల్లో 75శాతం వాటాతోఉన్నాయి. వాటిలో ఎక్కువ రూ.10 లక్షలరుణాలే కావడం విశేషం. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ వ్యయంతోనే రుణం లభిస్తుంది. 5-7శాతం వడ్డీతో ఉంటుందని, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో పోలిస్తే తక్కువ వడ్డీకే రుణం లభిస్తుందని పారిశ్రామికవేత్తలు ఉత్సాహపడ్డారు. అయితే రానురాను ఇవి రావడం మంజూరుకావడంసంక్లిష్టం అవుతోంది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు కేవలం సెక్యూరిటీ ఉంటేనే రుణం ఇస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఉత్పత్తిరంగానికి ఎక్కువప్రాధాన్యతనిచ్చాయి. ఆహారశుద్ధిరంగం, టెక్స్‌టైల్‌, కెమికల్స్‌, ఆటో విడిభాగాలకు ఎక్కువ కేటాయింపులుజరిపినా రుణాలు లభించడం తక్కువే. ఈ పోర్టల్‌కు డిమాండ్‌ భారీగానే ఉంది. సుమారు 1.31 లక్షల దరఖాస్తులు రెండునెలలకే అందాయి. సగటు రునం రూ.30 లక్షలుగా ఉంది. ఈ దరఖాస్తులు సుమారు 40వేల కోట్లవరకూ ఉనానయి. ఎంఎస్‌ఎంఇ రంగంలో ఐదుశాతం కంపెనీల రుణభారం రూ.కోటికి తక్కువగానే ఉంది. ఇపుడున్న అంచనాలనుచూస్తే ఎంఎస్‌ఎంఇ బకాయిలురూ.25 లక్షలకోట్లుగా ఉన్నాయి. కోటి రూపాయలకు లోబడినరుణాలు మొత్తం రునాల్లో 30శాతం వాటాతో ఉంది. మొత్తం ఎస్‌ఎంఇ రంగంలో కోటి రూపాయల రుణం రూ.7.6 లక్షలకోట్లుగా ఉంది. రుణం మంజూరయిన తర్వాత కూడా పంపిణీ ఒక సవాల్‌గా నిలిచింది. పోర్టల్‌పరంగా మంచి పథకమే కానీ మంజూరు విడుదలపంపిణీని కూడా జాప్యం తగ్గించాల్సి ఉంటుంది. పోర్టల్‌వల్ల తరచూ బ్యాంకు శాఖలకు వెళ్లే సమస్య తప్పుతున్నది. అలాగే ఎంఐఎస్‌ పరంగా రుణాల మంజూరు తిరస్కృతి కూడా సులువవుతున్నది. అధికారికగణాంకాలప్రకారం పోర్టల్‌కు 1.31 లక్షల దరఖాస్తులు మొదటి 50రోజుల్లోనే అందాయి. వీటిలో 1.12 లక్షల దరఖాస్తులను ఆమోదించారు. వాటిమంజూరుశాతం 85గా ఉంది. ఈ మొత్తం దరఖాస్తుల్లో మంజూరయినవి 40,669కేసులున్నాయి. కేవలం మూడోవంతు మాత్రమే మంజూరయ్యాయి. ఇక విధానపరంగాచూస్తే టేకోవర్‌ రుణాలు బ్యాంకర్ల మధ్య నిబందనలు సడలించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉదాహరణకు ప్రస్తుత సెటప్‌లో వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణం విభిన్న బ్యాంకర్లనుంచి తీసుకోవడం కష్టం అవుతోంది. పారిపస్సు విధానంలో చిన్నరుణాల వాటాను తీసుకునేందుకు కొన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. రుణం మంజూరుతోపాటు విడుదలను కూడా వెనువెంటనే చేస్తే ఎంఎస్‌ఎంఇ రంగానికి ఎంతోమేలుచేసినట్లవుతుందని ఆర్ధికరంగనిపుణులు,పారిశ్రామికనిపుణులుచెపుతున్నారు.