కెరీర్‌లో అత్యుత్తమ 5వ ర్యాంకుకు సింధు,

sindhu , saina
sindhu , saina

కెరీర్‌లో అత్యుత్తమ 5వ ర్యాంకుకు సింధు,
సైనా నెహ్వాల్‌కు 9వ స్థానం

న్యూఢిల్లీ: బిడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానమే తన టార్గెట్‌ అని ప్రకటించిన స్టార్‌ షెట్లర్‌ సింధు ఆ దిశగానేఅడుగు లేస్తుంది. బిడబ్ల్యూఎఫ్‌ తాజా మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఐదవస్థానం సంపాదించింది. మరో హైదరాబాద్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తొమ్మిదవ స్థానంలో నిలిచింది.తైజు యింగ్‌ (చైనీస్‌ తైఫీ),కరోలినా మారిన్‌ (స్పెయిన్‌),హ్యస్‌ సంగ్‌ (కొరియా),సున్‌ యు (చైనా) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.గత సంవత్సరం ఇదే సమయానికి సింధు 12వ ర్యాంకులో ఉండటం గమనార్హం.అప్పుడు సైనా ర్యాంకు 2.వియత్నాంలో జరుగుతున్న ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో గురువారం భారత్‌ 1-4 తో కొరియా చేతిలో చిత్తయింది.మొదటి ఫిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి ప్రణవ్‌ చోప్రా 21-23,17-21తో యాంగ్‌ హీ-వీటాన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు.పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ 21-9,21-16తో కీన్‌ లాహ్‌ను ఓడించి స్కోరు సమం చేసినప్పటికి తరువాత భారత్‌ కు ఒక్క విజయమూ దక్కలేదు.పురుషుల డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి-మనుఅత్రి 21-12,21-17 తో డానీ క్రిస్టీనా,హెండ్రా విజయ చేతిలో పరాజయం పొందారు.మహిళల సింగిల్స్‌లో రితుపుర్ణ దాస్‌ 23-21,21-18తో జియాయు లియాంగ్‌ చేతిలో డబుల్స్‌లో అశ్విన్‌,సిక్కి 19-21,21-17,21-17తో రెన్‌ అంగ్‌ జియో వాంగ్‌ చేతిలో పోరాడి పరాజయం చెందారు.ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికి భారత్‌ క్వార్టర్స్‌ చేరింది.
నీతా అంబాని శుభాకాంక్షలు:
బిడబ్ల్యూఎఫ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షెట్లర్‌ సింధు కెరీర్‌ల్లోనే అత్యుత్తమంగా అయిదవ స్థానం దక్కించుకున్ననేపథ్యంలో ట్విటర్‌ వేదికగా సింధు అభిమానులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.టెన్నిస్‌ తార సానియా మీర్జా,అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ,కేంద్ర మంత్రి విజ§్‌ు గోయల్‌ తదితరులు సింధును అభినందించారు. కెరీర్‌లో ఉత్తమ ర్యాంకు సాధించిన సింధుకు శుభాకాంక్షలు,స్త్రీ శక్తిని చాటావు,ఈ తరం అమ్మాయిలకు నువ్వే స్ఫూర్తి అంటూ ట్వీట్‌ చేశారు.అనంతరం సింధు వారందరికి ధన్యవాదాలు తెలిపింది.