భారత్‌లో కొత్తగా 55,078 కరోనా కేసులు

మరో 779 మంది మృతి

Coronavirus in India
Coronavirus in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 55,078 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో 779 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 16,38,871కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 35,747కి పెరిగింది. 5,45,318 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10,57,806 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 1,88,32,970 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,42,588 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/