బ్రెజిల్‌లో 24 గంటల్లో 54,771 కొత్త కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,32,913

Brazil – corona

బ్రెజిల్‌: బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో కరోనా ప్రధాన కేంద్రంగా మారింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 54,771 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,32,913కు పెరిగిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్‌ ప్రభావంతో నిన్న ఒక్కరోజే దేశంలో 1206 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 48,954కు చేరింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 5,07,000 మంది కోలుకున్నారని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉన్నది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/