53వ పుట్టినరోజు జరుపుకుంటున్న ‘కింగ్‌ ఖాన్‌’ షారుక్‌

shahrukh khan
shahrukh khan

ముంబయి: బాలీవుడ్‌ ‘కింగ్‌ ఖాన్‌’ షారుక్‌ ఈరోజు తన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. షారుక్‌కి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజీ ఉంది. ఆయన పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే ముంబయిలోని తన నివాసంలో వేడుకలు మొదలయ్యాయి. ఆయన ఇల్లంతా విద్యుత్‌ కాంతులతో నిండిపోయింది. ఈరోజు ఉదయం ఇంటో తన కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అభిమానులు, సీనీ ప్రముఖుల నుండి షారుక్‌కు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.