జైలులో ఖైదీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ.. 51మంది మృతి

51-killed-30-injured-in-colombias-tolua-prison-riot-fire

తులువా: నైరుతి కొలబియాలోని తులువా జైలులో ఖైదీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. ఈ ఘ‌ట‌న‌లో 51మంది మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. జైలులో మంగళవారం ఖైదీలు మధ్య గొడవ మొదలైంది. దీనిని ఆపడానికి గార్డులు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకోవడానికి ఖైదీలు.. దుప్పట్లు, ఇతర వస్తువులకు నిప్పంటించారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో దాదాపు 30 మంది గాయపడ్డారని, వారిలో జైలు సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జైలులో మంటలు అదుపులోకి వచ్చాయని, ఖైదీలెవరూ తప్పించుకోలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో అందులో 1,267మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. మంటలు చెలరేగిన బ్లాక్‌లో 180 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/