బ్రెజిల్‌లో కొనసాగతున్న కరోనా ఉద్ధృతి

మొత్తం కేసులు సంఖ్య 40,91,801

brazil -corona virus

బ్రెసీలియా: బ్రెజిల్‌ కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 50,163 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ దేశంలో న‌మోదైన‌ మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,91,801కి చేరింది. బ్రెజిల్ ఆరోగ్య‌శాఖ శుక్ర‌వారం రాత్రి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇక బ్రెజిల్‌లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా ప్ర‌తిరోజూ భారీగా న‌మోద‌వుతున్నాయి. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 888 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,25,502కు చేరింది. కాగా, అంత‌కుముందు రోజు కూడా బ్రెజిల్‌లో 834 క‌రోనా మ‌ర‌ణాలు, 43,773 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అమెరికా త‌ర్వాత అత్య‌ధికంగా క‌రోనా పాజిటివ్‌ కేసులు న‌మోదైన దేశం బ్రెజిలే కావ‌డం గ‌మ‌నార్హం.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/