దళిత బంధు నిధులు రూ.500 కోట్లు విడుదల

రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో జారీ

హైదరాబాద్ : హుజూరాబాద్ లో దళితబంధు అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2 వేల కోట్లతో పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ క్ర‌మంలో హుజురాబాద్‌ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత బంధు అమ‌లుకు రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఈ ప‌థ‌కం అమ‌లు కోసం రూ. 500 కోట్లు విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పైల‌ట్ ప్రాజెక్టుగా తెలంగాణ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లు కానుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని హుజురాబాద్ వేదిక‌గా ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/