500, 2000నోట్లు ఎందుకు? 100, 200నోట్లు చాలు: చంద్రబాబు

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అమరావతి: మొదట్నుంచి పెద్ద నోట్లను వ్యతిరేకిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబు మరోసారి పెద్దనోట్లపై స్పందించారు. దేశంలో అవినీతిని సమూలంగా
నిర్మూలించాల్సిన అవసంరం ఉందని, అవినీతిని రూపుమాపాలంటే వ్యవస్థ నుంచి
పెద్దనోట్లను తొలగించాలని, రూ.500నోటు కూడా అవసరం లేదని, అలాంటిది
రూ.2000నోటు ఎందుకని? రూ.100, రూ.200నోట్లు సరిపోతాయని అన్నారు.