గుంటూరు జిల్లాలో 50 కి చేరిన పాజిటివ్ కేసులు

పరీక్ష ఫలితాలు రావలసిన కేసులు 180

50 positive cases in Guntur district
50 positive cases in Guntur district

Guntur:  జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 కి చేరుకుంది. గుంటూరు నగరంలోనే 35 పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం.

జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 8 కేసులు గుంటూరు నగరానికి సంబంధించినవి.

మరొక కేసు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన వ్యక్తి తాడేపల్లి వద్ద ఒక ప్రయివేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తికీ రావటం గమనార్హం.

గుంటూరు నగరంలో బుధవారం నమోదయిన కేసులలో ఆనందపేట కు చెందిన వారు 5గురు, కుమ్మరి బజారుకు చెందినవారు ఇరువురు, యానాది కాలనీకి చెందిన వారు ఒకరు వున్నారు.

జిల్లా లో ఇప్పటివరకు కరోనా నిర్ధారణకు నమూనాలు సేకరించి పరీక్షకు పంపించినవి 719. వాటిలో 489 మందికి వ్యాధి లేనట్టుగా నిర్ధారణ అయింది.

మరో 180 మందికి సంబంధించిన ఫలితాలు వెల్లడి కావలసి ఉన్నదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జే యస్మిన్ బుధవారం వెల్లడించారు.

జిల్లాలో బుధవారం 138 నమూనాలను పరీక్షకు పంపించినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం 98 మంది ఇసోలేషణ్ లో ఉన్నారన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారిలో 904 మనది స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో గృహ నిర్బంధంలో వున్నారని ఆమె తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా వున్న 68 క్వారంటైన్ కేంద్రాలలో 514 మంది ఉన్నట్టు వివరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/