సుదర్శన్ థియేటర్ వద్ద విరాట్ కోహ్లీ భారీ కటౌట్ ఏర్పటు

హైదరాబాద్ లోని RTC X రోడ్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కి సంబదించిన భారీ కటౌట్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మాములుగా RTC X రోడ్ లోని థియేటర్స్ వద్ద సినిమా హీరోల తాలూకా కటౌట్స్ ఏర్పటు చేస్తుంటారు. కానీ ఈరోజు కోహ్లీ పుట్టిన రోజు సందర్బంగా సుదర్శన్ థియేటర్ వద్ద భారీ కటౌట్ ఏర్పటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్టార్ట్ హీరోలకు మించి 50 అడుగుల విరాట్ కోహ్లీ భారీ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత పెద్ద కటౌట్ ను చూసిన తర్వాత దటీజ్ కోహ్లీ అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా కోహ్లీకి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇతర దేశాల్లో కూడా కోహ్లీకి విపరీతంగా క్రికెట్ అభిమానులు ఉన్నారు. బర్త్ డే సందర్భంగా కోహ్లీకి అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కూడా కోహ్లీకి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.