తమిళనాడులో కలకలం..50 కాకులు, 3 కుక్కలు మృతి

శాంపిళ్లు సేకరించిన అధికారులు..దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

50-crows-dead
50-crows-dead

తమిళనాడు: తమిళనాడులోని నాగపట్టణం జిల్లా పూంపుహార్‌ ఉన్నట్టుండి ఒక్కసారిగా 50 కాకులు, మూడు కుక్కలు మృతి చెందాయి. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కాకులు, కుక్కలు మృతి చెందడం ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. శునకాలు, కాకుల మృతి విషయాన్ని గ్రామ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులకు చేరవేశారు. గ్రామానికి చేరుకున్న అధికారులు చనిపోయిన శునకాలు, కాకుల నుంచి నమూనాలు సేకరించారు. పరీక్షల అనంతరం వాటి మృతికి గల కారణాలను వెల్లడిస్తామన్నారు. మరోవైపు, వీటిపై విష ప్రయోగం జరిగిందా? అనే విషయమై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాకులను, కుక్కలను పాతిపెట్టేందుకు గొయ్యి తవ్వి బ్లీచింగ్ చల్లుతున్న గ్రామస్తులు. ఊరంతా బ్లీచింగ్ చల్లుతున్న పారిశుధ్య కార్మికురాలు. కరోనా నేపథ్యంలో వైరస్ సోకకుండా అధికారులు మరిన్ని జాగ్రత్తలు చేపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/