11 పేమెంట్‌ బ్యాంకుల్లో ఐదు మూసివేత

ఆర్ధికపరిపుష్టి క్షీణించడమే మూలం

payment banks
payment banks


ముంబయి: రిజర్వు బ్యాంకు అనుమతులు మంజూరు చేసిన 11 పేమెంట్‌ బ్యాంకుల్లో ఐదు బ్యాంకులు ఇప్పటికే బోర్డు తిప్పేశాయి. పేమెంట్‌ బ్యాంకులకు తొలినాళ్లలో వచ్చినంత ప్రాచుర్యం రానురాను అడుగంటిపోయింది. డిపాజిట్లు మందగించడం, రుణపరపతి కల్పించే అవకాశం లేకపోవడమే ఈ బ్యాంకుల మనుగడకు ముప్పు వాటిల్లినట్లు చెబుతున్నారు. ఆర్‌బిఐ నాలుగేళ్లక్రితం11 పేమెంట్‌ బ్యాంకులకు లైసెన్సులు మంజూరుచేసింది. ఆర్ధికచేకూర్పును మారుమూల గ్రామాలకుసైతం విస్తరించడం, తక్కువ ఖర్చుతోకూడిన డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను అమలుకు తీసుకురావడంద్వారా మరింతగా ఆర్ధిక లావాదేవీలను పెంచడం అనేది ముఖ్యోద్దేశ్యం. వాస్తవానికి 11 మంది బ్యాంకర్లలో ఇపుడు కేవలం ఆరుమాత్రమే పనిచేస్తున్నాయి. మరికొన్ని కొన్ని నెలలకే మానుకున్నాయి. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌బ్యాంకు, ఆదిత్యబిర్లా ఐడియా పేమెంట్స్‌బ్యాంకు, ఫినో పేమెంట్స్‌బ్యాంకు, ఇండియాపోస్ట్‌ పేమెంట్స్‌బ్యాంకు, జియో పేమెంట్స్‌బ్యాంకు, ఎన్‌ఎస్‌డిఎల్‌ పేమెంట్స్‌బ్యాంకు, పేటిఎం పేమెంట్స్‌బ్యాంకులు ఏడుమాత్రమే ఇప్పటివరకూ కొనసాగుతున్నాయి. ఆదిత్యబిర్లా పేమెంట్స్‌బ్యాంకు తాజాగా తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు జులైలోనే వెల్లడించింది. దీనితో మొత్తం సంఖ్య ఆరుకు తగ్గిపోయింది. వీటిలో మూడు కంపెనీలు క్రియాశీలకగా కొనసాగుతున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/