ఐదుగురు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం

Telangana Assembly
Telangana Assembly

హైదరాబాద్‌: శాసనమండలి జూబ్లీహాల్‌లో  ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ చేశారు. మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, యెగ్గే మల్లేశం శేరి సుభాష్‌ రెడ్డి, రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే వీరిలో నలుగురు టిఆర్‌ఎస్‌ కాగా మరొకర్‌ ఎంఐఎం సభ్యుడు ఉన్నారు. ఈ కార్యక్రమానికి టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌, మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, ఇతర నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/