మౌలిక వసతుల ఆధునీకరణకు రూ.5 ల‌క్షలకోట్లు

EXPRESS WAY, MODI
EXPRESS WAY, MODI

న్యూఢిల్లీ: దేశంలో అన్ని ప్రాంతాల్లో మౌలికవసతుల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానినరేంద్రమోడీ పేర్కొన్నారు. తొమ్మిది కిలోమీటర్ల నిడివికలిగిన సమాంతర ఎక్స్‌ప్రెస్‌వేను ఆయనప్రారంభించి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఢిల్లీమీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించడం వల్ల ఈమార్గంలో ప్రయాణం కేవలం 40 నిమిషాలకే గమ్యంచేరుకోగలమన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేనుప్రారంభించిన తర్వాత ప్రధానిమోడీ ఓపెన్‌టాప్‌జీపులో ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించారు. తదనంతరం బాగ్‌పట్‌కు చేరుకుని 135 కిలోమీటర్ల తూర్పుసమాంతర ఎక్స్‌ప్రెస్‌వేనుసైతంప్రారంభించారు. దేశంలోమౌలికవసతుల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, దేశవ్యాప్తంగా 28 వేల కిలోమీటర్ల హైవేలను అభివృద్ధిచేసేందుకు తమప్రభుత్వం మూడులక్షలకోట్లు వ్యయం చేసిందని అన్నారు. హైవేలు, రైల్వేలు, ఎయిర్‌వేలు, ఇన్‌లాండ్‌వేస్‌నుసైతం తమ ప్రభుత్వం అభివృద్ధిచేసే కృతనిశ్చయంతో ఉందన్నారు. గతంలో రోజుకు 12 కిలోమీటర్ల నిర్మాణంజరిగే హైవేలు ఇపుడు రోజుకు 27 కిలోమీటర్ల నిర్మాణంజరుగుతోందని, గత ఏడాది పదికోట్ల మందిప్రయాణీకులు ప్రయాణించారని అన్నారు. 11వేల కోట్లతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన మోడీ ఈ నిర్మాణం మొత్తం కేవలం 500 రోజుల్లోనే పూర్తిచేయగలిగామన్నారు. ఐదులక్షలకోట్ల కేటాయింపులు భారత్‌మాలా ప్రాజెక్టుకింద హైవేలను ఆధునీకరించేందుకు కేటాయించామని, మరో 14 లక్షలకోట్లు వ్యవసాయరంగాలకు సంబంధించిన మౌలికవసతులు అభివృద్ధిచేసేందుకు కేటాయించినటు వెల్లడించారు. ప్రభుత్వం చెరకురైతుల బకాయిసమస్యలను పరిష్కరిస్తుందని, అఇందుకు అనుగుణంగా తగిన చర్యలు ప్రారంభించామన్నారు. అలాగే రైతుల పంటలకు గిట్టుబాటుధరలు కల్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు. సామాజిక న్యాయంపై మాట్లాడుతూ తమ ప్రభుత్వం దళితుల రక్షణకు కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌కోర్టులుసైతం ఏర్పాటుచేసిందని, అత్యాచారాలకేసులు ఈకోర్టుల్లో వేగంగా విచారిస్తారన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌హయాంలో నేరస్తులు, నిందితులు వారంతటావారే లొంగిపోతున్నారని అంతేకాకుండా ఇకపై నేరాలుచేయబోమని ప్రతిజ్ఞలుచేస్తున్నారన్నారు. గంగాప్రక్షాళనపథకంపైమోడీ మాట్లాడుతూ ఇప్పటివరకూ రూ.21వేల కోట్లతో 200కుపైగాప్రాజెక్టులు చేపట్టామన్నారు. 70 ఏళ్లపాటు కాంగ్రెస్‌ దేశప్రజలను వంచనచేసిందని, ఇవిఎంలు ఇతర కీలక అంశాల్లో వివాదాలను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోందని మోడీ ధ్వజమెత్తారు. అనంతరం ఈ సమాంతర ఎక్స్‌ప్రెస్‌పై ఓపెన్‌టాప్‌జీపులో కొంతదూరం ప్రయాణించారు.