మరోసారి అమెరికాలో కాల్పులు.. పోలీసు సహా ఐదుగురు మృతి

5 Killed In Shooting In US’ North Carolina, Minor Suspect In Custody

వాషింగ్టన్‌ః మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం సంభవించింది. నార్త్‌ కరోలినాలో దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. నార్త్‌ కరోలినాలోని న్యూస్‌ రివర్‌ గ్రీన్‌వే సమీపంలో తెల్లజాతీయుడైన ఓ టీనేజీ యువకుడు కాల్పులు జరపడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించామని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మరణించినవారిలో ఒక పోలీస్‌ కూడా ఉన్నాడని పేర్కొన్నారు. కాగా, నిందితుడిని ఇంకా పట్టుకోలేదని, ప్రస్తుతం అతడు ఓ గ్యారేజీలో దాక్కున్నాడని, పోలీసులు ఆ యువకుడిని చుట్టుముట్టారని వెల్లడించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/