4వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

Goda Devi
Goda Devi

ఆళి మళైక్కణ్ణా! ఒను. నీ కూకరవేల్‌,
ఆళియుళ్‌ పుక్కుముకన్దు కొడార్తేఱి
ఊళిముత్వన్‌ ఉరువమ్బెల్‌ మె§్‌ుకఱత్తు
పాళియన్దోలుడైప్పఱ్పనాపన్‌కైయిల్‌
ఆళాపోల్‌ మిన్ని వలమ్బురిపోల్‌ నిస€తిర్‌న్దు
తాళాదే శార్జముదైత్త శరమళై పోల్‌
వాళవులకినిల్‌ పెయ్.తిడాయ్., నాంగళుమ్‌
మార్గళి నీరాడ మకళ్‌న్దేలో రెమ్బావాయ్..

భావం :

వరుణదేవుడు గంభీరస్వభావము కలవాడు. సముద్రములోని నీటిని పీల్చుతాడు. ఆకాశమును అధిరోహిస్తాడు. నీలిమేఘశ్యాముడు సర్వవ్యాపి. విశాలమైన సుందర భుజములు గలవాడు. పద్మనాభుడు.

అతని చేతిలోని చక్రమువలె ప్రకాశించునట్లుగా మెరయాలి. పాంచజన్యము చేయు శబ్దములా ఉరుమాలి. దక్షిణబాహువునగల సుదర్శన చక్రమువలె మెరయాలి.

శార్‌జ్ఘమునుండి వెలువడు బాణములవలె ఆలస్యముకాకుండ వర్షించాలి. లోకములు సుఖించాలి. సంతోషంగా ఆ వర్షములో మార్గ శిర స్నాముచేద్దాం అనుచు గోపికలను రండి అంటు కోరుతున్నది.

ఫలం : ‘సత్సంగం’ లభిస్తుంది

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/