జ‌మ్మూక‌శ్మీర్‌లో 4జీ సేవ‌ల పున‌రుద్ద‌ర‌ణ

internet
internet

క‌శ్మీర్: జ‌మ్మూక‌శ్మీర్‌లో 4జీ సేవ‌ల‌ను పున‌రుద్ద‌రించ‌నున్నారు.  జ‌మ్మూ ప్రాంతంలోని ఓ జిల్లాలో, క‌శ్మీర్ లోయ ప్రాంతంలోని ఓ జిల్లాలో.. 4జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.  ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ట్ర‌య‌ల్స్ ప‌ద్ధ‌తిలో సేవ‌ల‌ను అందుబాటులోకి తెస్తారు.  అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు లేదా నియంత్ర‌ణ రేఖ స‌మీపంలో మాత్రం 4జీ సేవ‌లు ఉండ‌వు.  ఉగ్ర‌వాద చ‌ర్య‌లు త‌క్కుగా ఉన్న ప్రాంతాల్లో మాత్ర‌మే ఈ స‌డ‌లింపు ఉంటుంద‌ని అధికారులు చెప్పారు. మ‌ళ్లీ రెండు నెల‌ల త‌ర్వాత ప్ర‌భుత్వం స‌మీక్ష చేయ‌నున్న‌ది.  గ‌త ఏడాది ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేసిన త‌ర్వాత‌.. జ‌మ్మూక‌శ్మీర్‌లో హై స్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు. ట్ర‌య‌ల్స్ ప‌ద్ధ‌తిలో మ‌ళ్లీ 4జీ సేవ‌ల‌ను పున‌రుద్ద‌రించ‌నున్న‌ట్లు అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ ఇవాళ సుప్రీంకోర్టు‌కు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/