రూ.కోటి ఖర్చుతో పాట

REGINA
Regina

రూ.కోటి ఖర్చుతో పాట

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో డబ్బులు దిరకడమే కష్టంగా మారింది. అలాంటిది ఒక సినిమాలో పాట కోసం కోటి రూపాయలు ఖర్చుపెడుతున్నారంటే అది ఏ రేంజ్‌ లో రూపొందుతోందొ.. తెలుస్తోంది. అయితే అది ఏ స్టార్‌ హీరో సినిమా కోసమో కాదు.. అలా అని భారీ బడ్జెట్‌ సినిమా కూడా కాదు. కష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న నక్షత్రం సినిమాలో ఓ పాట కోసం ఇంత మొత్తాన్ని ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. సందీప్‌ కిషన్‌ హీరోగా కష్ణవంశీ నక్షత్రం అనే సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో రెజీనా, ప్రగ్యా జైస్వాల్‌, సాయి ధరం తేజ్‌ లు కూడా నటిస్తున్నారు. అయితే హీరోయిన్‌ రెజీనాపై కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఓ పాట చిత్రీకరించడానికి రెడీ అయిపోయాడు కష్ణవంశీ. కష్ణవంశీ సినిమాల్లో హీరోయిన్లను చాలా అందంగా, రొమాంటిక్‌ గా చూపిస్తుంటాడు. అలానే ఈ సినిమాలో కూడా రెజీనాను రొమాంటిక్‌ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం భారీ లెవెల్లో ఈ పాటను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క పాటలో రెజీనా 15 కాస్ట్యూమ్స్‌ ను ధరించబోతోందట. అలానే 300 మంది డాన్సర్లు ఈ పాటలో కనిపించనున్నట్లు సమాచారం. కేవలం ఈ ఒక్క పాట కోసం దాదాపు ఆరు వందల మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది.