ఏపిలో మరో 465 కొత్త పాజిటివ్‌ కేసులు

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,961

coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 465 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,961కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 376 మంది రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 70 మందితో పాటు విదేశాల నుంచి వచ్చిన మరో 19 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీలో కరోనాతో ఇప్పటి వరకూ 96 మంది మృతి చెందారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 6230 పాజిటివ్‌ కేసులకు గాను 3065 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 3069 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/