దేశంలో కొత్తగా 4,518 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 4,518 మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 9 మంది చనిపోయారు. ఆదివారం 2,779 మందికి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.73 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.

కాగా, దేశవ్యాప్తంగా ఆదివారం 2,57,187 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,12,87,000కు చేరింది. మరో 2,78,059 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 297,830 మంది వైరస్​ బారినపడ్డారు. 476 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 506,274,649కు చేరింది. మరణాల సంఖ్య 6,320,335కు చేరింది. ఒక్కరోజే 443,857 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 506,274,649గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/