అమెరికాలో 10 శాతానికిపైగా నిరుద్యోగ రేటు !

గత వారం నిరుద్యోగ భృతి కోసం 44 లక్షల మంది దరఖాస్తు

unemployment
unemployment

అమెరికా: కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తాజా ఉద్యోగ గణాంకాల ప్రకారం అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నట్టు తేలింది. 1930లో ఏర్పడిన మహామాంద్యం తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడినట్టు నిపుణులు చెబుతున్నారు. 193140 మధ్య నిరుద్యోగ రేటు కనిష్ఠంగా 14 శాతానికి పైగా ఉండగా, గరిష్ఠంగా 25 శాతంగా నమోదైంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/