జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి..44 గేట్లు ఎత్తివేత

44 gates of Jurala project lifted

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. జలాశయంలోకి 2,35,000 క్యూసెక్కుల వరద జలాలు వస్తున్నాయి. దీంతో అధికారులు 44 గేట్స్ ఎత్తివేసి 2,40,835 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 8.010 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 318.516 మీటర్లకుగాను ఇప్పుడు 317.690 మీటర్లు ఉన్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/