ఢిల్లీలో కొత్తగా మరో 412 పాజిటివ్‌ కేసులు

ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడి

corona virus- delhi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కేసుల ఢిల్లీలో పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో కొత్తగా మరో 412 కరోనా కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈరోజు 183 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా మరణాలవీ సంభవించలేదని వివరించింది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 14,465కు చేరిందని, మరణాల సంఖ్య 288గా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 6,954 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 7,223 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/