అమ్మాయి దూరాన్ని సహించలేకపోతున్నాను

వ్యధ

 

SAD GIRL
SAD

అమ్మాయి దూరాన్ని సహించలేకపోతున్నాను

నా వయస్సు 45 సంవత్సరాలు. మా వారికి 52 సంవత్సరాలు. మేమిద్దరం కూలి చేసుకునే కుటుంబంలో పుట్టాం. ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదువ్ఞకున్నాం. మా ఆయన ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ నేర్చుకుని ఓ పెద్ద భూస్వామి ఇంట్లో కొలువ్ఞకు కుదిరాడు. అక్కడే నేను పనిమనిషిగా చేరాను. మా ఇద్దరి కులాలు, ఆర్థిక పరిస్థితులు ఒకటి కావడంతో ఒకరంటే ఒకరు ఇష్టపడ్డాం. భూస్వామి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వారు కూడా ప్రభుత్వ బడుల్లో చదివి పనిమనుషులు కావడం ఇష్టం లేక పట్నానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నా భర్తపై ఒత్తిడి తెచ్చి ఒప్పించాను. భూస్వామికి మా అభిప్రాయం చెబితే అన్యమనస్కంగానే సమ్మతించి, చేతి ఖర్చులకు సాయం చేశాడు. పట్నం వెళ్లిన తర్వాత మావారు అతికష్టం మీద ఒక ట్రావెల్స్‌లో కారు డ్రైవరుగా చేరాడు. అతనికి వచ్చే జీతంతో ఇల్లు గడవడమే కష్టం కావడంతో నేను నాలుగిళ్లల్లో పాచిపని చేయడానికి నిర్ణయించుకున్నాను. ఇద్దరి సంపాదన చాలా పొదుపుగా ఖర్చుపెడుతూ పిల్లలిద్దరినీ కాన్వెంటులో చేర్పించాం. మా శ్రద్ధకు తగ్గట్టుగానే పిల్లలు బాగా చదువ్ఞకున్నారు. ఇద్దరు పదవ తరగతి, ఇంటర్‌ మీడియెట్‌లో మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి పెద్దమ్మాయి మెడిసిన్‌లోను, చిన్నమ్మాయి బి.ఫార్మసీలోను సీట్లు సంపాదించుకున్నారు. ఈ దశలో మావారు ఒక యాక్సిడెంట్‌లో కాలు పోగొట్టుకుని ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిది. ‘వెన్నపడే సమయంలో కుండ పగిలినట్టుగా మా పరిస్థితి తయారయ్యింది. పిల్లల చదువ్ఞలకు తగిన డబ్బు, సౌకర్యాలు సమకూర్చడం చాలా కష్టమయ్యింది. ఈ దశలో నేను పనిచేసే ఒక ఇంటి యజమానికి లొంగిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయనే మా పిల్లల భారం పంచుకుంటున్నాడు. ఈ విషయంలో మావారి సమ్మతి తీసుకున్నాను. ఆయన కన్నీళ్లు పెట్టుకుని, నన్ను అక్కున చేర్చుకుని, త్యాగం చేయక తప్పదని తలూపాడు. అనైతిక జీవితం గడుపుతున్నందుకు బాధగా వ్ఞన్నా పిల్లల కోసం తట్టుకుంటూ వస్తున్నాను. మా పెద్దమ్మాయి మెడిసిన్‌ పూర్తి చేసి, పిజిలో చేరడానికి ప్రయత్నించే సమయంలో నా వివాహేతర బంధం గూర్చి తెలుసుకున్నది. దాంతో ఆమె పిజి చదవడం మానేసి, మమ్మల్ని వదిలేసి, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది. తన బ్రతుకు తాను బ్రతుకుతోంది. అయినా పిల్లల కోసం దిగజారిన నాకు ఆ పిల్లలే దూరమవడాన్ని సహించలేకపోతున్నాను. గతకొంత కాలంగా డిప్రెషన్‌కు గురై బాధపడుతున్నాను. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అయితే కాలులేని భర్త, చదువ్ఞ పూర్తికాని రెండో కూతురు గుర్తొచ్చి చావలేకపోతున్నాను. ఈ మానసిక క్షోభనుంచి బయట పడటానికి మార్గం చూపండి.
– ఒక సోదరి, విశాఖపట్నం

అమ్మా! మీ సమస్యను సహానుభూతితో అర్థం చేసుకున్నాను. మన సమాజం లో ‘మంచి చెడు అన్నవి ప్రత్యేకంగా లేవ్ఞ. చూసే దృష్టిలో తేడా తప్ప అన్నారు ఒక మహానుభావ్ఞడు. పిల్లల శ్రేయస్సు, భర్త క్షేమం కోసం మీరు చేసింది మీ దృష్టిలో గొప్పత్యాగం. మీ పెద్ద కూతురి దృష్టిలో అది హేయమైన చర్య. సమాజంలో చర్చకు పెడితే వారివారి విజ్ఞతకొద్ది విశ్లేషిస్తారు. మీరు మీ భర్తను మోసగించకుండా ఆయన సమ్మతితోనే వివాహేతర బంధం సాగించారు కాబట్టి ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే సామాజిక ధర్మాలు, నైతిక విలువలు ఈ చర్యను వ్యతిరేకిస్తాయి. కాబట్టి ఎవరు ఏమం టారు, ఏది అధర్మం అన్న మీమాంసను వదిలిపెట్టండి. ఇటీవల ఒక మహిళ నదిలో మునిగిపోతున్న వారిని కాపాడటానికి తన చీరను విప్పి సాయ మందించింది. ఫేస్‌బుక్‌లో ఆమె చర్యను ప్రతివారు ప్రశంసించా రు. ఆమె లాగ ప్రపంచం విమ్మల్ని ప్రశంసించకపోవచ్చు. ఎవరో మెచ్చుకోవాలని మీరు ఎదురు చూడాల్సిన పనిలేదు. మీ పెద్ద కూతురు మిమ్మల్ని విడిచివెళ్లిపో యినందుకు దిగులు పడటం మానండి. మీకు దూరంగా ఉన్నప్పటికి ఆమె కాళ్లపై ఆమె నిలబడుతున్నందుకు సంతోషించండి. కన్నతల్లిగా ఆమెకు ఒక దారి చూపినందుకు, బాధ్యతలు నిర్వహించిన తల్లిగా ఆనందిం చండి. భర్త, రెండో కూతురి కోసం శ్రమిస్తున్నందుకు గర్వప డండి. భవిష్యత్తుపై ఆశతో, అన్ని సమస్యలు పరిష్కారమవ్ఞతా యన్న సానుకూల ఆలోచనలతో బ్రతుకు భారాన్ని మోయండి. ఆలోచనల్లో మార్పు మీ డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. ఒకవేళ పదేపదే ఆత్మహత్యాభావాలు వెంటాడుతుంటే సైకియాట్రిస్టును కలసి మందు లు వాడండి. ఒక మానసిక నిపుణుని సాయంతో మీ పెద్దమ్మాయి మనసు మార్చే ప్రయత్నం చేయండి. ఆమె కోర్కె ప్రకారం ఇక నుంచి అనైతిక వ్యవహారం మానేస్తానని హామీ ఇవ్వండి. లోకంలో జరిగే ఎన్నో ఘోరాలు, పాపకార్యాల కంటే మీరు చేసింది చాలా స్వల్పమని అర్థమయ్యేలా చెప్పించం డి. ఒకవేళ మీది తప్పయినా వృద్ధాప్యంలో మిమ్మల్ని చూడాల్సి న బాధ్యత ఆమెదే నని గుర్తు చేయండి. మీ తప్పును క్షమించి మిమ్మల్ని ఆదరించమని కోరండి. కొంత వివేకం కలిగిస్తే ఆమెలో తప్పక మార్పు వస్తుంది.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్ట్‌