ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

మా దేశంలో 40 ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయి

Imran Khan
Imran Khan

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వాషింగ్టన్‌లోని కాపిటల్‌ హిల్‌లో అమెరికా లామేకర్స్‌ను ఉద్దేశించి ఇమ్రాన్ మాట్లాడుతూపాక్‌లో 40 తీవ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. పాక్ సరిహద్దుల్లో ఈ తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వరుస పాక్ ప్రభుత్వాలు ఈ నిజాన్ని అమెరికాకు చెప్పలేకపోవడం దురదృష్టకరమని అన్నారు.ఉగ్రవాదంపై అమెరికా పోరులో తాము కలిసి పనిచేస్తున్నామని, 9/11 ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని అన్నారు. అల్‌ఖైదా ఆప్ఘనిస్థాన్‌లో ఉందని చెప్పారు. పాకిస్థాన్‌లో తాలిబన్ మిలిటెంట్లు ఎవరూ లేరని తెలిపారు. అయినప్పటికీ ఉగ్రవాద పోరులో అమెరికాతో తాము కలిసి పనిచేస్తున్నామన్నారు.అమెరికాతో పాకిస్థాన్ అనుబంధం పరస్పర నమ్మకాల ఆధారంగా ఉండాలని ట్రంప్ కు తాను చెప్పానని ఇమ్రాన్ అన్నారు. శాంతిని నెలకొల్పే దిశగా పాకిస్థాన్ ఏం చేయబోతుందో ట్రంప్ కు వివరించానని తెలిపారు. తాలిబాన్లతో చర్చలు జరిపేందుకు కృషి చేస్తున్నానని… ఇప్పటి వరకైతే తాము కొంత సాధించామని… అయితే, ఇది అనుకున్నంత సులభం కాదనే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశానని చెప్పారు. అమెరికాపాకిస్థాన్ ల మధ్య పూర్తి నమ్మకం లేకపోవడం తనను బాధిస్తోందని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/