40 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం

gold
gold


హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలో ఓ వాహనం నుంచి వంద కిలోలకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోదీనగర్‌లో చెకింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు ఆ వాహనాన్ని సీజ్‌ చేశారు. దాదాపు 40 కోట్ల విలువ చేసే 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగుర్ని అరెస్టు చేశారు. ఈ బంగారాన్ని ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది. క్యాషియర్‌, డ్రైవర్‌తో పాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నారు.