నాలుగు జట్లతో మహిళల ఐపిఎల్‌

BCCI announces 4 teams will participate in Women's T20 Challenge 2020
BCCI announces 4 teams will participate in Women’s T20 Challenge 2020

ముంబయి: దేశంలో మహిళల క్రికెట్‌కు కూడా విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరింత అభివృద్ధికి కృషి చేసేందుకు గానూ బిసిసిఐ అడుగులు వేస్తుంది. ఈ ఏడాది నాలుగు జట్లతో మహిళల టీ20 ఛాలెంజ్‌ టోర్నీ నిర్వహిస్తామని తెలిపింది. జైపూర్‌ వేదికగా దీనిని నిర్వహిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ‘మహిళల క్రికెట్‌ అభివృద్ధికి బిసిసిఐ కంకణం కట్టుకుంది. 2020 మహిళల టీ20 ఛాలెంజ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సారి టోర్నీలో నాలుగో జట్టును చూడబోతున్నాం’ అని బోర్డు కార్యదర్శి జే షా తెలిపారు. పురుషుల ఐపిఎల్‌ ప్లే ఆఫ్ సమయంలో మహిళల మ్యా‌చ్‌లను నిర్వహించనున్నారు. జైపుర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సారి ఏడు మ్యాచులు జరుగుతుండటం ప్రత్యేకం. 2018లో తొలిసారి ఈ టోర్నీ నిర్వహించగా మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/