చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident
Road Accident

చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని కేవీ పల్లి మండలం మహల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిని రాయచోటికి చెందిన వారిగా గుర్తించారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కాగా తిరుపతి నుంచి రాయచోటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే రోడ్డు నిబంధనలు అతిక్రమించి బస్సును పూర్తిగా కుడివైపున నడపడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఆర్టీసి బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది. విషమంగా ఉన్న వ్యక్తి తిరుపతిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/