ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్‌ మృతి

encounter
encounter

లక్నో: ఈరోజు ఉదయం బీహార్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈఘటనలో నలుగురు నక్సల్స్‌ మృతిచెందారు. రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్‌ జిల్లా బాగహా ప్రాంతంలో సశస్త్ర సీమాబల్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయని పోలీసులు వెల్లడించారు. నక్సల్స్‌ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/