నగరంలో ఒకే రోజు నాలుగు హత్యలు

గోల్కొండలో రౌడీ షీటర్ దారుణ హత్య

muder
muder

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఒకే రోజు జరిగిన నాలుగు హత్యలు కలకలం రేపాయి. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా వారిలో ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండకు చెందిన రౌడీషీటర్ చాందీ షేక్ మహ్మద్, అతడి స్నేహితుడైన చికెన్ సెంటర్ యజమాని ఫయాజుద్దీన్‌లు రాత్రి 10 గంటల సమయంలో ఎండీ లైన్స్ నుంచి గోల్కొండకు బైక్‌పై వెళ్తున్నారు.దీనిని గమనించిన ప్రత్యర్థులు క్వాలిస్ వాహనంలో వారిని వెంబడించి మొరైన్ బేకరీ సమీపంలో బైక్‌ను ఢీకొట్టారు. రోడ్డుపై పడిపోయిన షేక్ మహ్మద్, ఫయాజుద్దీన్‌‌లను పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారు.

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఘటనలో స్నేహితుడినే హతమార్చాడో యువకుడు. మల్లేపల్లికి చెందిన రాహుల్ అగర్వాల్ (28), అదే ప్రాంతానికి చెందిన అజర్ (28)లు చిన్ననాటి స్నేహితులు. రాహుల్ స్థానికంగా మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అల్లాపూర్ శ్మశాన వాటిక సమీపంలో రాహుల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇంకో ఘటనలో యాకుత్‌పురా చున్నేకిబట్టి చందానగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (25) దారుణ హత్యకు గురయ్యాడు. జాఫర్‌రోడ్డుకు వెళ్లే మార్గంలో నిన్న నడుచుకుంటూ వెళుతున్న ఇమ్రాన్‌పై దుండగులు కత్తితో దాడిచేసి పొడిచారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/