అల్లూరి జిల్లాలో లొంగిపోయిన మావోలు

అల్లూరి జిల్లా పాడేరు ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట నలుగురు మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. గాలికొండ ఏరియా కమిటీ మావోయిస్టు దళానికి వీరు సహాయ సహకారాలు అందించేవారని ఎస్పీ వెల్లడించారు. వీరంతా గాలికొండ ఏరియా కమిటీ ఆచూకీ లేకపోవడం వల్ల జనజీవన స్రవంతులు కలిస్తే కేసులు ఎత్తివేయడం ఇతర సదుపాయాల వల్ల లొంగిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.