ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

car accident
car accident

కడప: కడప జిల్లా చిన్నమండెం మండలంలోని కేశాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు నుంచి కడప వెళ్తున్న కారు కేశాపురం వద్ద ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను కడపకు చెందిన హర్షవర్ధన్, బుజ్జి, భూదేవిగా గుర్తించారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/