ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

road accident
road accident

ఛత్తీస్‌గడ్‌: దంతెవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున విశాఖ నుంచి దంతెవాడ వెళ్తుండగా కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాద జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన వారు విశాఖ వాసులని.. నిమ్స్‌ ఆసుపత్రి డాక్టర్‌ సునీత కుటుంబంగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్ లోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్, తేజాజీ నగర్ లో ఈ రోజు తెల్లవారుజామున రెండు కార్లు ఢీకొట్టకోవడంతో ఆరుగురు మృతి చెందగా మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/