జవాన్ల మధ్య ఘర్షణతో కాల్పులు.. నలుగురి మృతి
దీపావళి సెలవుల విషయంలో గొడవ..తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఘటన
4 CRPF personnel killed after jawan opens fire at camp in Chhattisgarh
దుమ్ముగూడెం: దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. ఫలితంగా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పరిధిలోని లింగంపల్లి బేస్‌క్యాంపులో ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీపావళి సెలవుల విషయంలో సీఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్ల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. అది మరింత ముదరడంతో సంయమనం కోల్పోయిన జవాన్లు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో బీహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి, బెంగాల్‌కు చెందిన రాజుమండల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధర్మేందర్ అనే మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/