సాగ‌ర్‌కు కొన‌సాగుతున్న వ‌ర‌ద ప్ర‌వాహం

Nagarjunasagar
Nagarjunasagar

హైదరాబాద్‌: నాగార్జున‌సాగ‌ర్‌కు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతున్న‌ది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు క్ర‌స్ట్ గేట్ల‌ను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 92,346 క్యూసెక్యుల నీరు వ‌స్తున్న‌ది. క్ర‌స్టుగేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని వ‌దులుతున్నారు. జ‌లాశ‌యం పూర్తిస్థాయి నీటినిల్వ సామ‌ర్థ్యం 312.04 టీఎంసీలుకాగా, ప్రాజెక్టులో ప్ర‌స్తుతం 312.03 టీఎంసీల నీరు ఉన్నది. సాగ‌ర్ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 590 అండుగులు. భారీగా నీరు వ‌చ్చిచేరుతుండ‌టంతో ప్రాజెక్టు నిండుకుండ‌లా మారింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/