రెండు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం

earth quake
earth quake


భువనేశ్వర్‌: ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. ఒడిశాలోని మయూర్‌బంజ్‌ జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాయిరంగ్‌పుర, బిసో§్‌ు, బహలాదా, గోరుమహిసాని ప్రాంతాల్లో ఉదయం 6.20 నిమిషాలకు ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. జార్ఖండ్‌లోనూ రిక్టర్‌ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. గురాబండ, దుమారియా, ఘట్‌సీల, సరైకేలా, ఖరసావన్‌ ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదు అయ్యింది. ఐతే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/