4 రోజుల్లో 400 కోట్లు వసూలు చేసిన 2.0

Robo 2.0 Movie Posters
Robo 2.0 Movie Posters

ముంబై: రజనీ కాంత్‌ నటించిన 2.0 ఫిల్మ్‌..బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు ఆర్జించింది. ట్రేడ్‌ ఎనలిస్టు రమేశ్‌ బాలా ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో ఈ కలెక్షన్‌ విచ్చినట్లు ఆయన తెలిపారు. శంకర్‌ దర్శకత్వం వహించిన 2.0 ఇప్పుడు విదేశాల్లో అత్యధిక వసూళ్లు చేసిన దక్షిణ భారత చిత్రంగా రికార్డుకెక్కింది.