4 మిలియన్‌ వ్యూస్‌

AMAR, AKBAR, ANTONY
AMAR, AKBAR, ANTONY

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం అమర్‌ అక్బర్‌ అంటోనీ.. కాగా నిన్న విడుదలైన ఈచిత్రం ట్రైలర్‌కు మంచి స్పందనవచ్చింది.. ఇప్పటికే నాలుగు మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుందని యూనిట్‌ పోస్టర్‌ ద్వారా తెలిపింది.. ఇక ట్రైలర్‌ ప్రధానంగా ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వాళ్లు కొందరైతే, శక్తి మేరకు నయవంచన చేసే వాళ్లు కోకొల్లలు..అంటూ సాగే వాయిస్‌ ఓవర్‌తో మొదలవుతుంది.. ట్రైలర్‌ చూస్తుంటే శ్రీనువైట్ల తన దర్శకత్వ శైలికి భిన్నంగా ఈచిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.. ట్రైలర్‌లో మెయిన్‌గా దిస్‌ ఈజ్‌ నాట్‌ ఎ రివెంజ్‌,, ఇట్స్‌ ఎ రిటర్న్‌ గిఫ్ట్‌.. ఐయామ్‌ స్ట్రాంగ్‌ , యు ఆర్‌ స్ట్రాంగ్‌, వి§్‌ు ఆర్‌ స్ట్రాంగ్‌ అని రవితేజ చెప్పేడైలాగులు ఆకట్టుకుంటాయి.. తమన్‌ బ్యాగ్రౌండ్‌స్కోర్‌ కూడ ట్రైలర్‌ను బాగా ఎలివేట్‌ చేసింది.