4 ప్రయివేటు హాస్టళ్లకు జిహెచ్‌ఎంసి జరిమానా

GHMC
GHMC

హైదరాబాద్‌: మాదాపూర్‌లోని పలు ప్రయివేటు హాస్టళ్లలో జిహెచ్‌ఎంసి అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత, సెల్లార్‌లలో వంటగది నిర్వహిస్తున్న నాలుగు హాస్టళ్లకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ప్రమాణాలు పాటించకపోతే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. చందానగర్‌ సర్కిల్‌లోని మియాపూర్‌ జంక్షన్‌లోని పటు హోటళ్లు, రెస్టారెంట్లపై ఇటీవలే మున్సిపల్‌ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.