4 నుంచి ఒంటిపూట పాఠశాలలు

School
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో విద్యాశాఖ ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను వారం రోజులు ముందుకు జరిపింది. ఈనెల 16 నుంచి ఈ ఒక్కపూట బడులు ఉంటాయని ఇంతకుముందు అకడమిక్‌ షెడ్యూల్‌లో పెట్టారు. అయితే ఎండలు రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతో పాఠశాలలకువెళ్లే విద్యార్థులు, టీచర్ల ఆరోగ్యంపై విపరీత ప్రభావం పడుతోంది.
దీంతో ఈ ఒంటిపూట పాఠశాలల షెడ్యూల్‌ను మార్చి 16వ తేదీకి బదులు మార్చి 8వ తేదీ నుంచే ప్రారంభమయ్యలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంథ్యారాణి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈమేరకు మంగళవారం ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డైరెక్టర్లు, డీఈఓలు తగు చర్యలు తీసకోవాలని కమిషనర్‌ ఆదేశించారు.