ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

రాంబాన్ ఎన్కౌంటర్ లో ముగ్గురు ముష్కరులు హతం

ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

దిల్లీ: రంబాన్‌ జిల్లాలోని బటోతే ప్రాంతంలో జమ్ము-శ్రీనగర్‌ హైవేలో ఉగ్రవాదులు ఉదయం బస్సును ఆపేందుకు యత్నించగా అనుమానించిన బస్సు డ్రైవర్‌ ఆపకుండా వెళ్లి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భద్రతా దళాలు అక్కడికి చేరుకోవడంతో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి గ్రనేడ్లు విసిరారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన పోరులో పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముష్కరులను మట్టుబెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ భారత జవాను కూడా మరణించినట్లు జమ్ము ప్రాంత ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. 

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/