ముచ్చింత‌ల్ లో మూడోరోజు స‌హ‌స్రాబ్ది వేడుక‌లు

హైదరాబాద్: ముచ్చింత‌ల్ లో మూడో రోజు స‌హ‌స్రాబ్ది వేడుక‌లు జ‌రుగుతున్నాయి. సహస్రాబ్ది సమారోహం లో ముడవరోజు అష్టాక్షరి మహామంత్ర జపం తో నిర్విఘ్నంగా ప్రారంభం అయింది. మహా యాగంలో ఈరోజు ఐశ్వర్య ప్రాప్తికై శ్రీలక్మీ నారాయణేష్టి,వైనతేయేష్టి ఆరాధన జరుగనున్నాయి. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా పరిగణిస్తూ పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు.

ఈ ఉదయం 6 గంటల 30నిమిషాలకు ప్రారంభమైన అష్టాక్షరీ మహామంత్ర జపం 7 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు హోమాలు ప్రారంభించారు. ఆ తర్వాత 10 గంటల 30నిమిషాలకు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్య ప్రవచనం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల 30 గంటలకు పూర్ణాహుతి నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు మరోసారు హోమాలు చేస్తారు. ప్రవచన మండపంలో లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/