దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621
మొత్తం మృతుల సంఖ్య 4,40,752

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,27,621కి చేరింది. అలాగే, నిన్న 43,903 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 219 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,752కి పెరిగింది.
ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,21,81,995 మంది కోలుకున్నారు. 4,04,874 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 68,75,41,762 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క కేరళలోనే 26,701 కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో 74 మంది ప్రాణాలు కోల్పోయా
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/