ఒక్కరోజులోనే 36వేల కరోనా కేసులు

అగ్రరాజ్యంను అతలాకుతలం చేస్తున్న కరోనా

corona virus
corona virus

వాషిగ్టన్‌: అమెరికాను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తుంది. అగ్రరాజ్యంలో కరోనా కేసులు పది లక్షలకు చేరువయ్యాయి. గడచిన 24 గంటలలో కోత్తగా 36వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 9,56,375 కు చేరుకుంది. ఈ వైరస్‌ భారిన పడి ఒక్క రోజులోనే 2,494 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 53,928 కు చేరుకుంది. ప్రపంచంలో నాలుగో వంతు మరణాలు అమెరికాలో నే సంభవించాయి. కరోనా ధాటికి అమెరికాలో ఆందోళనకర పరిస్థితలు నెలకొంటున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/