దేశంలో కొత్తగా 35,662 కేసుల నమోదు

3.34 కోట్లకు పెరిగిన మొత్తం కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. శుక్రవారం 34 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా తాజాగా 35,662 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల్లో 281 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.34 కోట్లకు చేరింది. అలాగే, ఇప్పటి వరకు 3.26 కోట్ల మంది వైరస్ బారినుంచి బయటపడ్డారు.

నిన్న కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. 33 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 3.4 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దేశంలో కరోనాబారినపడి 4,44,529 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేటు 1.02 శాతంగా, రికవరీ రేటు 97.65 శాతంగా ఉన్నట్టు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, దేశంలో నిన్న నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కేరళలో 22 వేలు, మహారాష్ట్రలో 3,595 కేసులు నమోదయ్యాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/