దేశంలో కొత్తగా 34,403 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 3,33,81,728
మొత్తం మృతుల సంఖ్య 4,44,248
corona virus-india
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజూ 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 34,403 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,81,728కి చేరింది. అలాగే, నిన్న 37,950 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 320 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,44,248 కి పెరిగింది.
ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,25,98,424మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,39,056 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 67,43,775 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 77.24 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/