తెలంగాణలో 34 ఐపీఎస్ పోస్టలు ఖాళీలు : కేంద్ర హోంశాఖ

హైదరాబాద్ : తెలంగాణ లో 34 ఐపీఎస్ పోస్టలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ తెలియచేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో టిఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, మాలోత్ కవిత, పసునూరి దయాకర్ లు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఐపీఎస్ నుండి రాష్ట్ర పోలీస్ వరకు నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉమ్మడిగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్ల నుండి, రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ప్రమోషన్లా మేరకు 20 మందిని ఐపీఎస్ అధికారులను నియమించామని ఆయన చెప్పారు. 2020 సంవత్సరంలో సివిల్ సర్వీస్ పరీక్ష నుండి 5 మందిని తెలంగాణ క్యాడర్ కు ఎంపిక చేసినట్టు మంత్రి సమాధానం ఇచ్చారు. అలాగే ,కేంద్ర ప్రభుత్వం సివిల్ పరీక్ష ధ్వారా ఎంపికయ్యే ఐపీఎస్ అధికారుల సంఖ్య 150 నుండి 200 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుందని నిత్యానంద రాయ్ విమర్శించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/