34% బిసి రిజర్వేషన్ల అమలులో ఆటంకాలను ప్రభుత్వమే తొలగించాలి

-ఎపి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ‘కేసన’ డిమాండ్‌

34% బిసి రిజర్వేషన్ల అమలులో ఆటంకాలను ప్రభుత్వమే తొలగించాలి
AP BC leader Kesana Shankara Rao

Guntur: వచ్చే ఏడాది మార్చి నెలచివరిలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనను అమలు జరిపే విషయంలో బిసి 34శాతం రిజర్వేషన్లను యధాతథంగా పాటించాలని ఎపి బిసి సంక్షేమ సంఘండిమాండ్‌ చేసింది.. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 34శాతాన్ని అమలు జరపటానికి నిర్ణయించినట్టుగా తెలుస్తోందని, అయితే ఆ తర్వాత ఎపి హైకోర్టులో బిసి వ్యతిరేకులు కొందరు 34 శాతాన్నితగ్గించాలి అని, తద్వారా రిజర్వేషన్ల 50శాతానికి మించుతాయని, అభ్యంతరాలు తెలియజేస్తూ పిటిషన్‌ దాఖలు చేస్తున్నట్టుగా కూడ తెలుస్తోందని , ఇదేవిధంగా 2012లో ఉమ్మడి హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేయగా, అక్కడ బిసిలకు నష్టతరమైన ఉత్తర్వులు వెలువడ్డాయని అన్నారు.

అయితే బిసి ప్రతినిధులు సుప్రీం కోరుఎ్టకు వెళ్లి 34శాతం రిజర్వేషన్లను 2013 ఎన్నికల వరకు కాపాడుకోగలిగారన్నారు. అయితే రాబోయే ఎన్నికలోల కూడ 34శాతం రిజర్వేషన్లు ప్రకారమే ఎన్నికలునిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర€యించినట్టుగా సమాచారం తెలిసిందని, దాని తర్వాతే హైకోర్టులో తాజాగా ఈ పిటిషన దాఖలు అయ్యిందన్నారు. సుప్రీం కోర్టు నుంచి ఒక ఉత్తర్వును పొందవల్సిందిగా నూతన రాష్ట్ర ప్రభుత్వాన్ని బిసి సంక్షేమ సంఘం కొన్ని నెలలుగా కోరుతూ వచ్చిందన్నారు.. మార్చి నెలలోగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34శాతం రిజర్వేషన్లును పరిరక్షించవలిసి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. హైకోర్టులో 34శాతం పరిరక్షణ వాదనలను బలంగా విన్పించింది బిసిలకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ఎపి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు, నాయకులు గోలి రవి, ముళ్ల అప్పారావు, మీసాల గోవిందరావు, స్వామి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/