32వ రోజుకు చేరిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌

YS Jagan
YS Jagan

అనంత‌పురంః వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర 32వ రోజుకు చేరుకుంది. సోమవారం కూడేరులో ఆయన పర్యటించనున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి బహిరంగసభలో జగన్ మాట్లాడనున్నారు. కాగా ఆదివారం ఉరవకొండ, కోటంక, ఉడుగూరు, కమ్మూరు, అరవకురులో జగన్ పాదయాత్ర సాగింది. అరవకురులో పాదయాత్ర ముగిసిన తర్వాత ఆదివారం రాత్రి ఆయన కూడేరులో బస చేశారు. తిరిగి కాసేపట్లో కూడేరు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.